ఏపీపీఎస్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు లెక్చరర్ పోస్టుల పరీక్ష వాయిదా
ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్జీయూకేటీ లెక్చరర్ పోస్టుల భర్తీ పరీక్ష వాయిదా పడింది. పరిపాలనాపరమైన కారణాల వల్ల డిసెంబరు 2న జరగాల్సిన ప్రాథమిక పరీక్షను <b>డిసెంబరు 9కి మారుస్తున్నట్లు</b> ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా వివరాలు వెల్లడించాయి. డిసెంబరు 2న జరిగే పరీక్ష మినహా మిగతా పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. అభ్యర్థులు సవరించిన కొత్త తేదీని గుర్తుంచుకుని తదనుగుణంగా తమ ప్రిపరేషన్ను కొనసాగించాలని సూచించారు. పరీక్ష తేదీ వాయిదా పడడంతో అభ్యర్థులకు అదనంగా మరో వారం రోజుల సమయం లభించింది.